ప్రకృతి వ్యవసాయంతోనే భూసార పరిరక్షణ

రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయ శాఖ అధికారులు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): వ్యవసాయాన్ని రక్షించి, భూసారాన్ని మెరుగుపరుస్తూ సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా శుక్రవారం మందమర్రి మండలంలోని ఆదిల్‌పేట గ్రామపంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెన్నూర్ సహాయ వ్యవసాయ సంచాలకులు భాను ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భాను ప్రసాద్ మాట్లాడుతూ, ‘వ్యవసాయాన్ని రక్షిద్దాం’ అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా సహజ...