బీటీ రోడ్డుపై గుంతలు.. ప్రమాదకరంగా చౌరస్తా!
అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలి ముదిరాజ్ సంఘం జిల్లా కార్యదర్శి కొరివి నర్సింలు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో బీటీ రోడ్డుపై గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొరివి నర్సింలు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నాలుగు రహదారులు కలిసే చౌరస్తా వద్ద రోడ్డుపై గుంతలు ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చౌరస్తా వద్ద నిత్యం వాహనాల రాకపోకలు కొనసాగుతుండగా, రహదారిపై గుంతల కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు....