CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 10:35 am Posted By: coalbelt 24 News

బీటీ రోడ్డుపై గుంతలు.. ప్రమాదకరంగా చౌరస్తా!

అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలి
ముదిరాజ్ సంఘం జిల్లా కార్యదర్శి కొరివి నర్సింలు

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో బీటీ రోడ్డుపై గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొరివి నర్సింలు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నాలుగు రహదారులు కలిసే చౌరస్తా వద్ద రోడ్డుపై గుంతలు ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

చౌరస్తా వద్ద నిత్యం వాహనాల రాకపోకలు కొనసాగుతుండగా, రహదారిపై గుంతల కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు అప్రమత్తంగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రహదారి దెబ్బతినడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా, చిన్నపాటి నిర్లక్ష్యం జరిగినా ప్రమాదాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

అదేవిధంగా చౌరస్తా సమీపంలో వైన్స్ ఉండటంతో అక్కడ రద్దీ పెరిగే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో రహదారిపై గుంతలు మరింత ప్రమాదకరంగా మారే సూచనలు ఉన్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వెంటనే స్పందించాలని కోరారు.

ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని బీటీ రోడ్డుపై ఉన్న గుంతలను తక్షణమే పూడ్చి, చౌరస్తా వద్ద ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కొరివి నర్సింలు అధికారులను విజ్ఞప్తి చేశారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే నివారణ చర్యలు చేపట్టడం మంచిదని, ప్రజలకు సురక్షితమైన రహదారి సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});