కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 25న హైదరాబాద్‌లో మహాధర్నా
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 25న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) మందమర్రి బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్. వెంకటస్వామి, యూనియన్ కార్యదర్శి తుమ్మల రాజిరెడ్డి తెలిపారు. శుక్రవారం కేకే-5 గని వద్ద కార్మికులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా మహాధర్నాకు సంబంధించిన గోడపత్రికను కార్మికుల సమక్షంలో ఆవిష్కరించారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడాలని, కేంద్రంలోని...