బీబీపేట్‌లో పండుగ సాయన్న జయంతి
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): తెలంగాణ ప్రజల గుండెల్లో ధైర్యసాహసాలకు, పేదల పక్షాన నిలిచిన పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలను బీబీపేట్ మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాలాభిషేకం చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, పండుగ సాయన్న ముదిరాజ్ పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిలబడి, అన్యాయానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ధీరుడని కొనియాడారు. ఆయన జీవితం, పోరాట స్ఫూర్తి...