CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 3:43 pm Posted By: coalbelt 24 News

బీబీపేట్‌లో పండుగ సాయన్న జయంతి

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

తెలంగాణ ప్రజల గుండెల్లో ధైర్యసాహసాలకు, పేదల పక్షాన నిలిచిన పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలను బీబీపేట్ మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాలాభిషేకం చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, పండుగ సాయన్న ముదిరాజ్ పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిలబడి, అన్యాయానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ధీరుడని కొనియాడారు. ఆయన జీవితం, పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

పండుగ సాయన్న ముదిరాజ్ చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఆయనకు తగిన గుర్తింపు లభించేలా కృషి చేయాలని అన్నారు. ముదిరాజ్ సమాజం విద్య, సామాజిక ఐక్యత, ఆర్థిక అభివృద్ధి రంగాల్లో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. యువత తమ హక్కులపై అవగాహన పెంపొందించుకొని, సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. పండుగ సాయన్న ముదిరాజ్ పోరాట స్ఫూర్తి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మండలంలోని ముదిరాజ్ సంఘం పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});