TRS కార్యాలయంలో కొమరం భీమ్ జయంతి వేడుకలు

ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కొమరం భీమ్‌కు ఘన నివాళులు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ఆదివాసీల హక్కుల సాధన కోసం ‘జల్‌.. జంగల్‌.. జమీన్‌’ నినాదంతో పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు కొమరం భీమ్‌ జయంతి వేడుకలను గురువారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమరం భీమ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం కొమరం భీమ్‌ చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌...