ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కొమరం భీమ్‌కు ఘన నివాళులు
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
ఆదివాసీల హక్కుల సాధన కోసం ‘జల్.. జంగల్.. జమీన్’ నినాదంతో పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు కొమరం భీమ్ జయంతి వేడుకలను గురువారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సందర్భంగా కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం కొమరం భీమ్ చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఎల్. రూప్ సింగ్, నవీన్ ఆచారి, సయ్యద్ ఇస్మాయిల్, లోకిని రాజు, పెందోర్ యశ్వంత్ రావు, కోరెం గణేశ్, సెడమాకి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});