CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 3:29 pm Posted By: coalbelt 24 News

మూడు కార్పొరేషన్ల ఎన్నికలే లక్ష్యంగా కవిత ‘రాజధాని రణభేరి’

శుక్రవారం మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్‌లో సమావేశం
పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక సమావేశానికి సిద్ధమయ్యారు. ‘రాజధాని రణభేరి’ పేరుతో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు.

మూడు కార్పొరేషన్ల పరిధిలోని పార్టీ ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. రానున్న బల్దియా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలోపేతం, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల కార్యాచరణపై కవిత నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

రాష్ట్ర రాజధాని పరిధిలో పార్టీని బలోపేతం చేయడంపై కవిత ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. తాజాగా శుక్రవారం జరిగే సమావేశానికి పార్టీ ముఖ్య నేతలకు ఆహ్వానాలు పంపించారు.

జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలోని మొత్తం 300 డివిజన్లలో అభ్యర్థులను బరిలోకి దింపే అంశంతో పాటు, ఎన్నికల ఎజెండాపై కవిత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});