మంచిర్యాలలో కాంగ్రెస్‌ది ఆధిపత్య రాజకీయాలు!

ముఠా రాజకీయాలతో ప్రజల్లో భయాందోళనలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్‌ ప్రజల సమస్యలను పరిష్కరించాలి జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించాలి CPI(AM) జిల్లా నాయకులు కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): మంచిర్యాల నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకులు ఆధిపత్యం కోసం గ్రూపులు, ముఠాలుగా ఏర్పడి రౌడీ రాజకీయాలకు పాల్పడుతున్నారని CPI(AM) మంచిర్యాల జిల్లా కమిటీ నాయకులు ఆరోపించారు. అధికారాన్ని, పదవులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములు, ప్రజల ఆస్తులను కబ్జా చేస్తూ, ప్రజలను బెదిరింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పూలే భవన్‌లో నిర్వహించిన...