CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 8:21 pm Posted By: coalbelt 24 News

24న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక

ఆసిఫాబాద్ ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో పోటీలు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు గోనే శ్యాం సుందర్ రావు, ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్ తెలిపారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

బుధవారం మందమర్రిలో వారు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హ్యాండ్‌బాల్ క్రీడపై ఆసక్తి ఉన్న బాలికల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, అర్హులైన క్రీడాకారిణులను జిల్లా జట్టుకు ఎంపిక చేయడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. క్రీడాకారిణులు తమ నైపుణ్యాన్ని, శారీరక సామర్థ్యాన్ని, ఆటతీరును ప్రదర్శించి జిల్లా స్థాయిలో గుర్తింపు పొందేందుకు ఈ ఎంపిక పోటీలు చక్కని అవకాశమని తెలిపారు.

ఆసక్తి గల క్రీడాకారిణులు ఈ నెల 24వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు ఆసిఫాబాద్‌లోని ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌కు చేరుకోవాలని సూచించారు. పోటీలకు హాజరయ్యే బాలికలు వయస్సు ధ్రువీకరణ పత్రాలు, నాలుగు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, బోనఫైడ్ సర్టిఫికెట్‌తో పాటు హెచ్‌ఎఫ్‌ఐకి సంబంధించిన మూడు ఫారాలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని కోరారు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});