CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 8:49 pm Posted By: coalbelt 24 News

సాయన్న జయంతిని ఘనంగా నిర్వహించాలి

ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు పిలుపు
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలను గురువారం (22-10-2026) ప్రతి గ్రామంలో, మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు పిలుపునిచ్చారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

రాష్ట్ర ప్రభుత్వం పండుగ సాయన్న జయంతిని అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో, ఈ ఏడాది నిర్వహించే తొలి అధికారిక జయంతి వేడుకలను రాజకీయాలకు అతీతంగా, అందరూ ఐకమత్యంతో కలిసి విజయవంతం చేయాలని ఆయన కోరారు. పండుగ సాయన్న ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన జయంతిని ఘనంగా నిర్వహించడం ద్వారా ముదిరాజ్ సమాజ ఐక్యతను చాటాలని పేర్కొన్నారు.

కామారెడ్డి పట్టణంలో అందుబాటులో ఉన్న ముదిరాజ్ సోదరులు, నాయకులు గురువారం ఉదయం 10 గంటలలోపు కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకోవాలని కోరారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు తమ తమ గ్రామాలు, మండల కేంద్రాల్లో జయంతి వేడుకలను నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై, పండుగ సాయన్న జయంతి వేడుకలను విజయవంతం చేసి సమాజ ఐక్యతను చాటాలని కొరివి నర్సింలు విజ్ఞప్తి చేశారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});