CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 7:10 pm Posted By: coalbelt 24 News

కులమతాలకు అతీతంగా మానవత్వమే ముఖ్యం

సద్దుల బతుకమ్మ, విజయదశమి సందర్భంగా శుభాకాంక్షలు.
ముదిరాజ్‌లకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలి

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సద్దుల బతుకమ్మ, విజయదశమి పండుగలను పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బీబీపేట మండల ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి, ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదరభావంతో కలిసి మెలిసి జీవించాలని, రాష్ట్ర ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో, నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కొరివి నర్సింలు మాట్లాడుతూ.. బీబీపేట మండలంలో ఇప్పటివరకు ప్రజలు కులమతాల భేదాలు లేకుండా కలిసిమెలిసి జీవిస్తున్నారని తెలిపారు. మనందరిదీ ఒకే జాతి.. అది మానవజాతి అని, కులమతాల పేరుతో విభేదాలు సృష్టించుకోవడం, ఆవేశాలకు లోనుకావడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రతి పౌరుడిని సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్ల అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.

ముదిరాజ్ సోదరులకు గతంలో ప్రకటించిన మూడెకరాల భూమి పథకంతో పాటు ముదిరాజ్ బంధు పథకాన్ని అమలు చేసి, కమ్యూనిటీ భవనాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ముదిరాజ్ సామాజికవర్గానికి జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని కోరారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే తదితర పదవుల్లో తగిన అవకాశాలు కల్పించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

పండుగల సందర్భంగా మహిళలు, అన్ని కులమతాల ప్రజలు సంతోషంగా ఉండాలని, రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరి ఇళ్లలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని కొరివి నర్సింలు ఆకాంక్షించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});