భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు
బీబీపేట సర్పంచ్ స్వాతిక సాయినాథ్
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా గ్రామంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గ్రామ సర్పంచ్ స్వాతిక సాయినాథ్ శనివారం తెలిపారు. పండుగలను పురస్కరించుకుని గ్రామ ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే బతుకమ్మ వేడుకల నేపథ్యంలో బురుజు వద్ద, మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్ స్వాతిక సాయినాథ్, ఉపసర్పంచ్ ప్రశాంత్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగే వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. బురుజు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా పారిశుధ్య పనులు చేపట్టి, బురుజు పైన కూడా శుభ్రత చర్యలు చేపట్టినట్లు వివరించారు.
గ్రామ ప్రజలందరూ పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని సర్పంచ్ స్వాతిక సాయినాథ్ ఆకాంక్షించారు. గ్రామంలోని ప్రతి కుటుంబం సుఖశాంతులతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});