తెలంగాణ ఉద్యమకారుడు హాజీ కి ఘనంగా నివాళులు

పార్థివదేహానికి నివాళులర్పించిన సలేంద్ర కొమురయ్య యాదవ్ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): తెలంగాణ ఉద్యమకారుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ కోఆప్షన్ సభ్యుడు హాజీ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ హాజీ స్వగృహానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హాజీ అంత్యక్రియల్లో పాల్గొని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, హాజీ మృతి పట్ల సంతాపం...