పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అట్ల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బీబీపేట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ నగరేశ్వర, కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ మహిళలు, ఆర్యవైశ్య సంఘం మహిళల కోసం ప్రత్యేకంగా బతుకమ్మల పోటీ నిర్వహించారు.
ఈ పోటీల్లో మహిళలు వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ప్రదర్శించారు. న్యాయనిర్ణేతలు బతుకమ్మల అలంకరణ, అందాన్ని పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. పోటీల్లో మొదటి బహుమతిని ఇల్లెందుల లతా ఆంజనేయులు, రెండో బహుమతిని భాశెట్టి పద్మ నాగేశ్వర్ గెలుచుకున్నారు. కన్సొలేషన్ బహుమతిని ఎర్రం విజయశేఖర్, రెండో కన్సొలేషన్ బహుమతిని బీబీపేట గ్రామ సర్పంచ్ ఉప్పల సాత్విక సాయినాథ్ అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు మురికి శ్రీనివాస్, కార్యదర్శి రెడ్డిశెట్టి శ్రీనివాస్, వైస్ గవర్నర్ భాశెట్టి నాగేశ్వర్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});