గ్రామ అభివృద్ధి, ప్రజల సుఖశాంతుల కోసం వేడుకోలు
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో ముదిరాజ్ సంఘం జిల్లా కార్యదర్శి కొరివి నరసింహులు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, పాడిపంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని, గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సందర్భంగా ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరీ నరసింహులు మాట్లాడుతూ.. బీబీపేట మండలంలో దుర్గాభవానీ నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారని పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల అనంతరం అమ్మవారి విగ్రహాలను తరలించే సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ముఖ్యంగా చెరువుల వద్ద, విద్యుత్ స్తంభాల సమీపంలో అమ్మవారి ఊరేగింపులు నిర్వహించే సమయంలో విద్యుత్ తీగల వల్ల ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమ్మవారి విగ్రహాలు, ఊరేగింపు మార్గంలో విద్యుత్ తీగలు అడ్డుగా ఉన్నట్లయితే వాటిని ముందుగానే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా, భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కరీ నరసింహులు కోరారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});