ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మెకు ఎంసీపీఐయూ మద్దతు
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి ఎంసీపీఐయూ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): షనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెకు మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) — ఎంసీపీఐయూ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఎంసీపీఐయూ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ, ప్రజారోగ్య పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న...