CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 4:38 pm Posted By: coalbelt 24 News

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు ఎంసీపీఐయూ మద్దతు

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి
ఎంసీపీఐయూ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్

కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

షనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెకు మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) — ఎంసీపీఐయూ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది.

ఎంసీపీఐయూ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ, ప్రజారోగ్య పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు అత్యల్ప వేతనాలు చెల్లిస్తూ, వారి సమస్యలను పరిష్కరించకపోవడం సరికాదని అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు వైద్య సేవలు అందించిన ఆరోగ్య మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు.

ప్రజారోగ్య వ్యవస్థపై ఆధారపడిన పేద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, వైద్య సేవలు సజావుగా కొనసాగాలంటే ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారి పోరాటానికి ఎంసీపీఐయూ పార్టీ అండగా ఉంటుందని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు వెనుకాడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఎంసీపీఐయూ పార్టీ ప్రధాన డిమాండ్లు

  1. ఉద్యోగుల క్రమబద్ధీకరణ: ఎన్‌హెచ్‌ఎంలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి.
  2. సమాన పనికి సమాన వేతనం: సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు కనీస వేతనాలు చెల్లించాలి.
  3. ఉద్యోగ భద్రత, వైద్య సదుపాయాలు: ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించి, ఈహెచ్‌ఎస్‌, ఈఎస్‌ఐతో పాటు ఉచిత వైద్య సదుపాయాలు అందించాలి.
  4. సకాలంలో వేతనాల చెల్లింపు: ప్రతి నెల ఒకటో తేదీన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరి బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ చేయాలి.
  5. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి.
  6. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు పరిహారం: విధి నిర్వహణలో లేదా ఇతర కారణాలతో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగి మరణించిన సందర్భంలో రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు, వారి కుటుంబంలో ఒకరికి అర్హత, హోదాకు తగిన ఉద్యోగ అవకాశం కల్పించాలి.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం గుర్తించి, వారి డిమాండ్లను పరిష్కరించాలని ఎంసీపీఐయూ పార్టీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయూ బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆరేపల్లి రమేష్, బెల్లంపల్లి మండల కార్యదర్శి తోగరి రాహుల్, సంబోజుల రాజేష్, నిఖిల్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});