బీబీపేట్‌లో ఆకట్టుకున్న సాధనశూరుల సాహస విన్యాసాలు

అంతరించిపోతున్న తెలంగాణ జానపద కళలను కాపాడాలి: తుమ్మ మచ్చేందర్ కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): బీబీపేట్ గ్రామంలో కాళికాదేవి భక్తులైన సాధనశూరులు ప్రదర్శించిన అద్భుత సాహస విన్యాసాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామం నుంచి వచ్చిన సాధనశూరులు అంతరించిపోతున్న తెలంగాణ జానపద కళలను ప్రదర్శిస్తూ ఇంద్రజాలం, కనికట్టు, పలు సాహస విన్యాసాలతో ప్రేక్షకులను అలరించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై వారి ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కామారెడ్డి డివిజన్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు తుమ్మ మచ్చేందర్...