మంచిర్యాలలో రూ.5కే టీ.. రూ.20కే టిఫిన్

సేవా దృక్పథంతో ‘హిందూ సేవా సమాజ్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో  కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): సేవే లక్ష్యంగా, సామాన్యులకు అందుబాటు ధరల్లో ఆహారాన్ని అందించాలనే సంకల్పంతో హిందూ సేవా సమాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ నగర్, పోచమ్మ గుడి ప్రక్కన రూ.5కే టీ, రూ.20కే టిఫిన్ అందించే కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వాహకులు బండవరపు జగన్, స్రవంతి గారు ప్రారంభించారు. నేటి రోజుల్లో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో సామాన్య ప్రజలు, కూలీలు, కార్మికులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు,...