CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 2:17 pm Posted By: coalbelt 24 News

మంచిర్యాలలో రూ.5కే టీ.. రూ.20కే టిఫిన్

సేవా దృక్పథంతో ‘హిందూ సేవా సమాజ్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

సేవే లక్ష్యంగా, సామాన్యులకు అందుబాటు ధరల్లో ఆహారాన్ని అందించాలనే సంకల్పంతో హిందూ సేవా సమాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ నగర్, పోచమ్మ గుడి ప్రక్కన రూ.5కే టీ, రూ.20కే టిఫిన్ అందించే కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వాహకులు బండవరపు జగన్, స్రవంతి గారు ప్రారంభించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి రోజుల్లో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో సామాన్య ప్రజలు, కూలీలు, కార్మికులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు తక్కువ ధరల్లో అల్పాహారం అందించడం అభినందనీయమని ఈ కార్యక్రమం ద్వారా సేవాభావాన్ని చాటిచెప్పారు. కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా, సమాజంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఆహారాన్ని అందించాలనే మానవతా విలువలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం విశేషం.

సేవే లక్ష్యం.. సమాజమే కుటుంబం!

ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం, సామాన్యులపై ఆర్థిక భారం తగ్గించడం, సమాజంలో సేవా స్ఫూర్తిని పెంపొందించడం వంటి ఆశయాలతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం సమాజానికి ఆదర్శప్రాయమని పలువురు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఆహారం అందుబాటులో ఉండాలనే ఆలోచనతో చేపట్టిన ఈ ప్రయత్నం స్థానిక ప్రజలకు ఉపయోగకరంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని పెంపొందించడంతో పాటు, పేదలకు అండగా నిలుస్తాయని, ఇలాంటి సేవా ప్రయత్నాలు మరింత విస్తరించాలని పలువురు ఆకాంక్షించారు. హిందూ సేవా సమాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం సమాజసేవకు ఒక మంచి ఉదాహరణగా నిలవాలని స్థానికులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో కె.వి. ప్రతాప్, కె. శేఖర్, గాదె సత్యం, వంగల రమేష్, చిందం శీను, చిలువేరు శ్రీనివాస్, అమీరి శెట్టి రాజ్ కుమార్, చుంచు రాజు కిరణ్, మల్క ప్రతాప్, మల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});