సింగరేణికి జెన్‌కో నుంచి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ‘చలో హైదరాబాద్’ తరలిన మందమర్రి బ్రాంచి నాయకులు, కార్మికులు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి సంస్థకు ప్రభుత్వ రంగ సంస్థ జెన్‌కో నుంచి రావాల్సిన రూ.59 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) చేపట్టిన ఆందోళనల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి మందమర్రి బ్రాంచి నుంచి సుమారు 50 మంది నాయకులు, కార్మికులు బస్సులో తరలివెళ్లారు. బ్రాంచి కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, బ్రాంచి ఉపాధ్యక్షుడు భీమనాధుని సుదర్శన్ ఆధ్వర్యంలో...