రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం

రైతుబంధు సాయం ఆలస్యం సాగునీరు, విద్యుత్‌ కొరతతో రైతులకు ఇబ్బందులు తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్‌ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): తెలంగాణ రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలు, నిర్లక్ష్యం కారణంగా రైతాంగం ఇబ్బందులకు గురవుతోందని తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్‌ విమర్శించారు. రైతులకు సకాలంలో ఆర్థిక సాయం అందకపోవడం, సాగునీటి కొరత, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా లేకపోవడం వంటి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని...