తెలంగాణ ఉద్యమకారుడు కాసర్ల సాంబశివరావు మృతి తీరని లోటు
పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): మాల మహానాడు మండల అధ్యక్షుడు, అలుపెరగని తెలంగాణ ఉద్యమకారుడు కాసర్ల సాంబశివరావు మృతి పట్ల తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం సాంబశివరావు స్వర్గస్తులైన విషయం తెలిసి విచారం వ్యక్తం చేసిన ఆయన, సోమవారం కాల్వ శ్రీరాంపూర్‌లో జరిగిన అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంబశివరావు భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి...