CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 3:25 pm Posted By: coalbelt 24 News

తెలంగాణ ఉద్యమకారుడు కాసర్ల సాంబశివరావు మృతి తీరని లోటు

పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్

కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మాల మహానాడు మండల అధ్యక్షుడు, అలుపెరగని తెలంగాణ ఉద్యమకారుడు కాసర్ల సాంబశివరావు మృతి పట్ల తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం సాంబశివరావు స్వర్గస్తులైన విషయం తెలిసి విచారం వ్యక్తం చేసిన ఆయన, సోమవారం కాల్వ శ్రీరాంపూర్‌లో జరిగిన అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంబశివరావు భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా సలేంద్ర కొమురయ్య యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కాసర్ల సాంబశివరావు చేసిన పోరాటం, సామాజిక న్యాయం కోసం ఆయన సాగించిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజ అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. సాంబశివరావు మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. కాసర్ల సాంబశివరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});