పోటీ పరీక్షల అభ్యర్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన

పరీక్షల ఒత్తిడిని అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం–2026 సందర్భంగా తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ (టీపీఏ) మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల పట్టణంలోని కాలేజ్ రోడ్డులో ఉన్న పద్మనాయక ఏసీ హాల్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కృష్ణవేణి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సహకారంతో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోచింగ్ క్యాంపులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవాలి...