సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా ప్రకటించాలి
మందమర్రిలో సీఐటీయూ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నల్లజెండాలతో నిరసన కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కోల్‌బెల్ట్ ప్రాంత రహదారులపై నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం మందమర్రి మార్కెట్ ఏరియాలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మందమర్రి బస్టాండ్ వద్ద నల్లజెండాలు ప్రదర్శిస్తూ నినాదాలతో నిరసన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగరేణి లాభాలను ప్రకటించి, కార్మికులకు వాటా అందించాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...