సింగరేణి కార్మిక గర్జన సభకు భారీగా తరలిరావాలి

మందమర్రిలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులతో బాల్క సుమన్ సమావేశం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ఈ నెల 14వ తేదీన గోదావరిఖనిలో నిర్వహించనున్న సింగరేణి కార్మిక గర్జన భారీ బహిరంగ సభకు మందమర్రి ఏరియా నుంచి కార్మికులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు. సింగరేణి కార్మిక గర్జన సభకు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా...