మందమర్రి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వైభవంగా దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన
వేద మంత్రోచ్చారణలు, హోమాలతో ఆధ్యాత్మిక శోభ ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సింగరేణి జీఎం రాధాకృష్ణ దంపతులు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): దసరా శరన్నవరాత్రుల పర్వదినాలను పురస్కరించుకొని మందమర్రి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ప్రతిష్ఠాపనతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, వేద మంత్రోచ్చారణలు, హోమాగ్ని పవిత్రత, మంగళవాయిద్యాల నడుమ భక్తులు అమ్మవారిని దర్శించుకొని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఈ పవిత్ర కార్యక్రమానికి మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్...