రెండేళ్లుగా ప్రారంభానికి నోచుకోని కాసిపేట ఆరోగ్య ఉపకేంద్రం!

లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా ప్రారంభానికి ముందే గోడలకు పగుళ్లు పిచ్చిమొక్కలతో నిండిన ఆవరణ మూలకు చేరిన విలువైన బాడీ ఫ్రీజర్ కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట): గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన కాసిపేట గ్రామపంచాయతీ పరిధిలోని ఆరోగ్య ఉపకేంద్రం రెండేళ్లు గడిచినా ప్రారంభానికి నోచుకోకపోవడం విచారకరం. ప్రజలకు అందుబాటులోకి రావాల్సిన వైద్య కేంద్రం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభానికి ముందే భవనం గోడలకు పగుళ్లు ఏర్పడగా, పరిసరాలు...