పూర్వ విద్యార్థుల గురుభక్తి ఆదర్శనీయం: కల్వకుంట్ల కవిత
పదవీ విరమణ పొందిన గురువు గుర్రం మహేశ్వర్ రెడ్డికి ఘన సన్మానం టాటా ఎలక్ట్రిక్ కారును బహుమతిగా అందించిన పూర్వ విద్యార్థులు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: విద్యాబుద్ధులు నేర్పిన గురువు గుర్రం మహేశ్వర్ రెడ్డి పట్ల పూర్వ విద్యార్థులు చూపిన అపారమైన ప్రేమాభిమానాలు, గురుభక్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కరీంనగర్‌లోని డైట్ (DIET)లో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేస్తూ ఇటీవల పదవీ విరమణ పొందిన గుర్రం మహేశ్వర్ రెడ్డిని తెలంగాణ రక్షణ...