CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 3:57 pm Posted By: coalbelt 24 News

పూర్వ విద్యార్థుల గురుభక్తి ఆదర్శనీయం: కల్వకుంట్ల కవిత

పదవీ విరమణ పొందిన గురువు గుర్రం మహేశ్వర్ రెడ్డికి ఘన సన్మానం
టాటా ఎలక్ట్రిక్ కారును బహుమతిగా అందించిన పూర్వ విద్యార్థులు

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

విద్యాబుద్ధులు నేర్పిన గురువు గుర్రం మహేశ్వర్ రెడ్డి పట్ల పూర్వ విద్యార్థులు చూపిన అపారమైన ప్రేమాభిమానాలు, గురుభక్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కరీంనగర్‌లోని డైట్‌ (DIET)లో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేస్తూ ఇటీవల పదవీ విరమణ పొందిన గుర్రం మహేశ్వర్ రెడ్డిని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత ఫోన్‌లో గుర్రం మహేశ్వర్ రెడ్డితో మాట్లాడి, విద్యారంగానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. గురువులు కేవలం పాఠాలు బోధించే వ్యక్తులు మాత్రమే కాదని, విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులని పేర్కొన్నారు. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూ, వారిని ఉన్నత స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని అన్నారు.

తమకు విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు మార్గదర్శకత్వం వహించిన గురువుకు పూర్వ విద్యార్థులంతా కలిసి చందాలు వేసుకుని టాటా ఎలక్ట్రిక్ కారును బహుమతిగా అందించడం అభినందనీయమని కవిత పేర్కొన్నారు. గురువు పట్ల వారు చూపిన ప్రేమ, గౌరవం, కృతజ్ఞతాభావం సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. గురువులను గౌరవించడం మన సంస్కృతిలో అంతర్భాగమని, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల సేవలను సమాజం ఎప్పటికీ మర్చిపోదని తెలిపారు.

అంకితభావంతో విద్యాబోధన చేసి ఎంతోమంది విద్యార్థుల జీవితాలకు బాటలు వేసిన గుర్రం మహేశ్వర్ రెడ్డి వంటి ఉపాధ్యాయులను సన్మానించుకోవడం గర్వకారణమని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. మహేశ్వర్ రెడ్డికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన విద్యారంగానికి, విద్యార్థులకు అందించిన సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నగర అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్, జిల్లా నాయకులు కుతాడి శ్రీనివాస్, బసవేణి రాజేందర్, బండారి అజయ్ తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});