ఆరోగ్యకరమైన జీవనం కోసం వ్యాయామం తప్పనిసరి

యువత మారథాన్‌లలో పాల్గొనాలి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి మందమర్రి ఎస్‌ఐ గోపతి నరేష్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో వ్యాయామం, రన్నింగ్‌, వాకింగ్‌ను తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని మందమర్రి పట్టణ ఎస్‌ఐ గోపతి నరేష్ సూచించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ క్వారీలో జీటీఆర్ ఫౌండేషన్, అటవీశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఫారెస్ట్ ట్రైల్ రన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ గోపతి నరేష్‌తో పాటు మందమర్రి రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు ఉత్సాహంగా పరుగులు తీశారు. అనంతరం...