CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 3:48 pm Posted By: coalbelt 24 News

దండేపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

అధ్యక్షుడిగా బండి రవిగౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఎనగందుల సత్యం

కోల్ బెల్ట్ న్యూస్(దండేపల్లి):

దండేపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలో జర్నలిస్టుల ఐక్యతను బలోపేతం చేస్తూ, పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ బాధ్యతలకు సభ్యులను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా బండి రవిగౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఎనగందుల సత్యం ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా గోపతి శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అల్లం కుమారస్వామి యాదవ్, కోశాధికారిగా మోదంపురం వెంకటేశ్, అధికార ప్రతినిధిగా ఎండీ షరీఫ్ ఎంపికయ్యారు.

ఉపాధ్యక్షులుగా బచ్చల సుభాష్, కట్ట వెంకటేశ్, మొంగని శ్రీనివాస్‌లను ఎన్నుకోగా, కార్యదర్శులుగా మండల మల్లేష్, ఎడ్ల రాజన్న బాధ్యతలు చేపట్టనున్నారు. సంయుక్త కార్యదర్శిగా ఎస్కే సద్దాం హుస్సేన్, ప్రచార కార్యదర్శిగా చుంచు చందు ఎన్నికయ్యారు. ముఖ్య సలహాదారులుగా జి. వెంకటపతి, బాసిరాజు రాజన్న, గడ్డం సత్యన్న వ్యవహరించనుండగా, కార్యవర్గ సభ్యులుగా శెర్ల చక్రపాణి, జాడి సత్యం, ఎస్పీ హరీష్ ఎంపికయ్యారు.

నూతన కార్యవర్గం జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం, పాత్రికేయుల మధ్య సమన్వయం, ప్రెస్ క్లబ్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు ఆకాంక్షించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ప్రజలకు మరియు ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య వారధిగా నిలుస్తూ బాధ్యతాయుతమైన పాత్రికేయ విలువలను కాపాడాలని అభిప్రాయపడ్డారు.

దండేపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగుతూ జర్నలిస్టుల అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});