దళిత పారిశ్రామికవేత్తలకు సమాన అవకాశాలు కల్పించాలి

కమిషన్లకు ఎన్‌ఫోర్సబుల్ అధికారాల కోసం రాజ్యాంగ సవరణ జరగాలి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు కేవలం విచారణ చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేసే అధికారాలే కాకుండా, తమ ఆదేశాలను అమలు చేయించగలిగేలా ఎన్‌ఫోర్సబుల్ అధికారాలు కల్పించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ఇందుకోసం రాజ్యాంగ సవరణ జరగాలని, ఈ అంశంపై ఎమ్మెల్యేలు, ఎంపీలు గళమెత్తాలని ఆమె పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు...