CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 4:26 pm Posted By: coalbelt 24 News

మోదీ 25 ఏళ్ల పాలన విజయోత్సవం

బెల్లంపల్లిలో ఘనంగా రక్తదాన శిబిరం
రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేసిన మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి

కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజా జీవితంలో 25 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని తాపీ మేస్త్రి సంఘం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ఘనంగా విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో పలువురు రక్తదాతలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొన్న రక్తదాతలకు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి సర్టిఫికెట్లు అందజేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి రక్తదాతలు అందించే సహకారం ఎంతో విలువైనదని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత, పార్టీ కార్యకర్తలు మరింత చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పట్టి వెంకట కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శులు రాచర్ల సంతోష్ కుమార్, వైద్య శ్రీధర్, నిర్మల్ జిల్లా మహిళా మోర్చా ఇన్‌చార్జి నల్లుల సంగీత, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పులగం తిరుపతి, పట్టణ అధ్యక్షురాలు ధార కళ్యాణి, కాసిపేట మండల అధ్యక్షుడు సూరం సంపత్, బెల్లంపల్లి మండల అధ్యక్షుడు రాజ్ కుమార్, నెన్నెల మండల అధ్యక్షుడు అంగళి శేఖర్, మద్దెర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});