ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
ప్రశ్నించే గొంతుకగా పార్టీ నిలుస్తుంది
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఓటరుగా శుక్రవారం నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పట్టభద్రులకు ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పార్టీ అంటేనే ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే గొంతుక అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే నిబద్ధత కలిగిన నాయకులకు రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో అవకాశం కల్పించామని తెలిపారు. పట్టభద్రులు తమ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలను మరింత బలంగా వినిపించేందుకు కీలకమైన అవకాశంగా టీఆర్‌ఎస్ భావిస్తున్నట్లు ఆమె వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});