మందమర్రి ఏరియాలో ఈ-వేస్ట్ సేకరణ కార్యక్రమం

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలి: జీఎం ఎన్. రాధాకృష్ణ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థవ్యాప్తంగా అక్టోబర్ 2 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న ‘స్పెషల్ డెడికేటెడ్ డ్రైవ్ – స్వచ్ఛత కార్యక్రమం’లో భాగంగా శుక్రవారం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఈ-వేస్ట్ (ఎలక్ట్రానిక్ వ్యర్థాల) సేకరణ, శాస్త్రీయ పద్ధతిలో విసర్జనకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్...