ఫ్లాష్…ఫ్లాష్…ఫ్లాష్…సింగరేణి కార్మికులకు దసరా పండుగ అడ్వాన్స్.
యాజమాన్యం ఉత్తర్వులు జారీ పర్మినెంట్ కార్మికులకు రూ.25 వేలు.. ట్రైనింగ్, బదిలీ ఫిల్లర్, తాత్కాలిక కార్మికులకు రూ.12,500 చొప్పున చెల్లింపు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి బొగ్గు గని కార్మికులకు దసరా పండుగను పురస్కరించుకొని పండుగ అడ్వాన్స్ చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ మందమర్రి ఏరియా బ్రాంచి కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, బ్రాంచి ఉపాధ్యక్షుడు భీమనాధుని సుదర్శన్ మందమర్రిలో కోల్‌బెల్ట్ న్యూస్‌కు తెలిపారు. యాజమాన్యం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం...