CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 11:37 am Posted By: coalbelt 24 News

ఫ్లాష్…ఫ్లాష్…ఫ్లాష్…సింగరేణి కార్మికులకు దసరా పండుగ అడ్వాన్స్‌.

యాజమాన్యం ఉత్తర్వులు జారీ
పర్మినెంట్ కార్మికులకు రూ.25 వేలు..
ట్రైనింగ్, బదిలీ ఫిల్లర్, తాత్కాలిక కార్మికులకు రూ.12,500 చొప్పున చెల్లింపు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సింగరేణి బొగ్గు గని కార్మికులకు దసరా పండుగను పురస్కరించుకొని పండుగ అడ్వాన్స్‌ చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ మందమర్రి ఏరియా బ్రాంచి కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, బ్రాంచి ఉపాధ్యక్షుడు భీమనాధుని సుదర్శన్‌ మందమర్రిలో కోల్‌బెల్ట్‌ న్యూస్‌కు తెలిపారు.

యాజమాన్యం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పర్మినెంట్‌ కార్మికులకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున, ట్రైనింగ్‌లో ఉన్న కార్మికులు, బదిలీ కార్మికులు, తాత్కాలిక కార్మికులకు ఒక్కొక్కరికి రూ.12,500 చొప్పున పండుగ అడ్వాన్స్‌ చెల్లించేందుకు అంగీకరించినట్లు వారు వివరించారు. పండుగకు అవసరమైన ఖర్చుల కోసం కార్మికులకు ఈ అడ్వాన్స్‌ ఆర్థికంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

పది నెలల్లో వేతనాల నుంచి రికవరీ

కార్మికులకు చెల్లించే పండుగ అడ్వాన్స్‌ను యాజమాన్యం తిరిగి పది నెలల కాలంలో వారి వేతనాల నుంచి విడతలవారీగా కోత విధించి రికవరీ చేయనున్నట్లు సలేంద్ర సత్యనారాయణ, భీమనాధుని సుదర్శన్‌ తెలిపారు. అయితే పదవీ విరమణ పొందిన కార్మికులకు, వైద్య కారణాలతో అన్ఫిట్‌ అయిన కార్మికులకు ఈ పండుగ అడ్వాన్స్‌ వర్తించదని స్పష్టం చేశారు.

ఈ నెల 15న బ్యాంకు ఖాతాల్లో జమ

ఈ నెల 15వ తేదీన కార్మికుల బ్యాంకు ఖాతాల్లో పండుగ అడ్వాన్స్‌ జమ కానున్నట్లు వారు వెల్లడించారు. దసరా పండుగకు ముందుగా అడ్వాన్స్‌ అందుబాటులోకి రావడం వల్ల కార్మికులు పండుగ అవసరాలను తీర్చుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.

సింగరేణి కార్మికులకు పండుగ అడ్వాన్స్‌ చెల్లించేందుకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేయడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఏఐటీయూసీ నాయకులు తెలిపారు. పండుగ వేళ కార్మిక కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలగనుండటంతో వారిలో ఆనందం నెలకొందని పేర్కొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});