చిత్రపురి కాలనీ అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి
600 మంది సినీ కార్మికులకు ఇళ్లు కేటాయించాలి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: చిత్రపురి కాలనీలో చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో చిత్రపురి కాలనీ సాధన సమితి నాయకులు కవితను కలిసి కాలనీలోని సమస్యలు, సినీ కార్మికులకు ఇళ్ల కేటాయింపులో జరుగుతున్నాయని పేర్కొంటున్న అవకతవకలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో మిగిలిన నాలుగు...