తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ సంబరాలు

మందమర్రి పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఘనంగా పూల పండుగ వేడుకలు సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థినులు, ఉపాధ్యాయినుల సందడి కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పూల పండుగను మందమర్రిలోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థినులు, ఉపాధ్యాయినులు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు, సంప్రదాయ నృత్యాలతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను...