కమలం నేతలకు గాలం వేస్తున్న గులాబీ నేత

మంచిర్యాల జిల్లాలో ఆకర్ష్ పథకం వేచిచూసే ధోరణిలో కమలం శ్రేణులు త్రిశంకుస్వర్గంలో మరికొందరు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: మంచిర్యాల జిల్లాలోని ప్రధాన పార్టీలో గ్రూపు నాయకత్వంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం సతమతమవుతోంది. బీజేపీ లో గ్రూప్ లు ఏర్పడి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. గ్రూప్ తగాదాలు రచ్చకెక్కి హైదరాబాద్ ప్రధాన కార్యాలయం వరకు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. గ్రూప్ రాజకీయాలతో తృతీయ శ్రేణులు తలపట్టుకుంటున్నారు. పార్టీని బలోపేతం చేయాలనుకున్న నాయకులే, బలహీనం చేయడంపై పలువురు అసహనంకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో...