CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 7:24 pm Posted By: coalbelt 24 News

కమలం నేతలకు గాలం వేస్తున్న గులాబీ నేత

మంచిర్యాల జిల్లాలో ఆకర్ష్ పథకం
వేచిచూసే ధోరణిలో కమలం శ్రేణులు
త్రిశంకుస్వర్గంలో మరికొందరు

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మంచిర్యాల జిల్లాలోని ప్రధాన పార్టీలో గ్రూపు నాయకత్వంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం సతమతమవుతోంది. బీజేపీ లో గ్రూప్ లు ఏర్పడి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. గ్రూప్ తగాదాలు రచ్చకెక్కి హైదరాబాద్ ప్రధాన కార్యాలయం వరకు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. గ్రూప్ రాజకీయాలతో తృతీయ శ్రేణులు తలపట్టుకుంటున్నారు. పార్టీని బలోపేతం చేయాలనుకున్న నాయకులే, బలహీనం చేయడంపై పలువురు అసహనంకు గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశపడుతున్న మంచిర్యాల నియోజకవర్గంకు చెందిన ఒక బిఆర్ఎస్ ప్రథమ శ్రేణి నేత పావులు కదుపుతున్నారు. తనదయిన శైలిలో అప్పుడే ఆకర్ష్ పథకం ప్రవేశ పెట్టారు. కాషాయం లో ఏర్పడిన రెండు గ్రూప్ లను అవకాశంగా తీసుకుంటున్నారు. టికెట్ భవిష్యత్తు ఎలా ఉన్నాసరే ? ముందు కాషాయం బలహీనతలను తన బలంగా మార్చుకోడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాషాయం శ్రేణుల్లో బలమైన నేతలను చేర్చుకోడానికి ఆ నాయకుడు తనదయిన శైలిలో పాచికలు విసురుతున్నారు. మా పార్టీలోకి రండి. నేను ఉన్న. మీకు అండగా ఉంటా. మా పార్టీలో గ్రూప్ లు లేవు. కలిసి కట్టుగా ఉందాం. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపు మనదే. మీకేం కావాలో చెప్పండి. అంటూ ఆ గులాబీ నేత ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేయడం విశేషం.

బిఆర్ఎస్ నేత ఆకర్ష్ పథకానికి కొందరు బీజేపీ నేతలు మొగ్గు చూపుతున్నట్టుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో జోరుగా ప్రచారం సాగుతోంది. అసంతృప్తితో ఉన్న కమలం నేతల్లో కొందరితో ఆ బిఆర్ఎస్ నేత ఫోన్ ద్వారా, వ్యక్తిగగతంగా మాట్లాడినట్టుగా కూడా పలువురు చెవులు కొరుకుంటున్నారు. మరికొందరు కమలం నేతలు వేచిచూసే ధోరణిలో కూడా ఉన్నారని సమాచారం. ఏది ఏమైనప్పటికీ కమలంలో ఉన్న అసంతృప్తిని తనకు అవకాశంగా మలచుకొని బలం పెంచుకోడానికి గులాబీ నేత పడుతున్న కష్టం ఏ మేరకు ఫలించనుందో వేచి చూడాల్సిందే.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});