SCCWU–IFTUలో చేరిన ఫస్ట్ జోన్ సివిక్ కాంట్రాక్ట్ కార్మికులు
కార్మిక హక్కుల సాధనకు ఐక్య పోరాటమే మార్గమన్న డి.బ్రహ్మనందం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సింగరేణి ఫస్ట్ జోన్‌లో పనిచేస్తున్న సివిక్ కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (SCCWU–IFTU)లో చేరారు. ఈ సందర్భంగా IFTU కండువాలు కప్పి వారిని సంఘంలోకి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి.బ్రహ్మనందం ఆహ్వానించారు.
ఈ సందర్భంగా డి.బ్రహ్మనందం మాట్లాడుతూ.. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల హక్కులు, వేతనాలు, పని భద్రత, కనీస సౌకర్యాల కోసం SCCWU–IFTU 1995 నుంచి నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు సరైన హక్కులు, సౌకర్యాలు లేని సమయంలో వారి సమస్యలను అధ్యయనం చేసి గోలేటి నుంచి మణుగూరు వరకు కార్మికులను ఐక్యం చేసి అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
కార్మికుల పోరాటాల నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ నిర్ణయించిన వేతనాలు చెల్లించాలని కోల్ ఇండియా యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసినప్పటికీ, సింగరేణిలో ఆ వేతనాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని డి.బ్రహ్మనందం ఆరోపించారు. సింగరేణి యాజమాన్యం అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వర్తించే వేతనాలను అమలు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో SCCWU–IFTU బెల్లంపల్లి రీజియన్ అధ్యక్ష, కార్యదర్శులు టి. శ్రీనివాస్, ఎం.డి. జాఫర్, IFTU జిల్లా నాయకులు మేకల సురేందర్, కార్మికులు చంటి తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});