CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 3:24 pm Posted By: coalbelt 24 News

విద్యుత్ అంతరాయాలతో ఎండుతున్న వరి పంటలు

24 గంటల ఉచిత విద్యుత్ హామీని అమలు చేయాలి
తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్

కోల్ బెల్ట్ న్యూస్(కరీంనగర్):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం దత్తూజిపేట గ్రామంలో సరైన విద్యుత్ సరఫరా లేక సాగునీరు అందక ఎండిపోతున్న వరి పొలాలను తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్, టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పంటల పరిస్థితిని రైతులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ.. రైతులు ఎంతో కష్టపడి సాగు చేసిన వరి పంటలకు కీలక సమయంలో సాగునీరు అందక ఎండిపోతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో వ్యవసాయ బోర్ల నుంచి నీటిని అందించలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, విద్యుత్ సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు.

విద్యుత్, సాగునీటి కొరత కారణంగా పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే గుర్తించి పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వారి ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హరిప్రసాద్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ నాయకులు మ్యాకల తిరుపతి, మ్యాక వినోద్, శ్రీరాముల రమేష్, చంటి శ్రీనివాస్, పుల్ల మల్లేశం, కరీంనగర్ నగర పార్టీ అధ్యక్షురాలు రంగరవేణి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});