విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా పౌష్టిక అల్పాహారం

మందమర్రి సింగరేణి హైస్కూల్‌లో అల్పాహారం ప్రారంభం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): విద్యార్థుల శారీరక ఆరోగ్యం, మానసిక వికాసం, ఏకాగ్రతను పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పౌష్టిక అల్పాహార (బ్రేక్‌ఫాస్ట్) కార్యక్రమాన్ని గురువారం మందమర్రిలోని సింగరేణి హైస్కూల్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అల్పాహారం వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ.. రేపటి పౌరులైన విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభ్యాసాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పౌష్టిక...