CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 3:39 pm Posted By: coalbelt 24 News

విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా పౌష్టిక అల్పాహారం

మందమర్రి సింగరేణి హైస్కూల్‌లో అల్పాహారం ప్రారంభం

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

విద్యార్థుల శారీరక ఆరోగ్యం, మానసిక వికాసం, ఏకాగ్రతను పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పౌష్టిక అల్పాహార (బ్రేక్‌ఫాస్ట్) కార్యక్రమాన్ని గురువారం మందమర్రిలోని సింగరేణి హైస్కూల్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అల్పాహారం వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ.. రేపటి పౌరులైన విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభ్యాసాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పౌష్టిక అల్పాహార కార్యక్రమాన్ని అమలు చేయడం అభినందనీయమన్నారు. ఉదయాన్నే పోషకాహారం తీసుకోవడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత పెరిగి, చదువుపై ఆసక్తి మెరుగుపడుతుందని తెలిపారు. మందమర్రి ప్రాంతంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ మోడర్న్ కిచెన్ ప్రారంభోత్సవం రోజునే సింగరేణి హైస్కూల్ విద్యార్థులకు కూడా అక్కడి నుంచి అల్పాహారం అందించాలని కోరినట్లు జీఎం తెలిపారు. నేటి నుంచి విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన, పౌష్టికాహారం అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు మోడర్న్ కిచెన్ సెంటర్ల నిర్మాణానికి సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యత (CSR) నిధుల నుంచి సుమారు రూ.50 కోట్లను కేటాయించినట్లు జీఎం వెల్లడించారు. ఇందులో మంచిర్యాల జిల్లాలోని మోడర్న్ కిచెన్ సెంటర్‌కు రూ.7.5 కోట్లను అందించినట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి సాంకేతికతతో, అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్కు చెందిన నిపుణులైన వంట సిబ్బంది ద్వారా విద్యార్థులకు అల్పాహారం సిద్ధం చేస్తున్నారని జీఎం ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె. పురుషోత్తం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});