ఉర్సు వేడుకల్లో కల్వకుంట్ల కవిత
రాష్ట్ర శాంతి, సౌభాగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: హసన్‌నగర్‌లోని దర్గా హజ్రత్ ఖ్వాజా షరీఫ్ హసన్ (రహ్మతుల్లాహి అలైహి) వద్ద నిర్వహించిన ఉర్సు షరీఫ్ వేడుకల్లో టీఆర్‌ఎస్ అధినేత శ్రీమతి కల్వకుంట్ల కవిత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల శాంతి, సౌభాగ్యం, సామాజిక న్యాయం, ఐక్యత కోసం ప్రార్థించారు. ఈ సందర్భంగా పేదలు, అణగారిన వర్గాలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సమాజంలోని అన్ని...